Cabinet Expansion: ప్రమాణ స్వీకారం చేసిన 43 మంది మంత్రులు వీరే

43 Leaders Take Oath as Cabinet Ministers
x

Cabinet Expansion: ప్రమాణ స్వీకారం చేసిన 43 మంది మంత్రులు వీరే

Highlights

Cabinet Expansion: మోడీ నయా టీమ్‌ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది.

Cabinet Expansion: మోడీ నయా టీమ్‌ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఊహించని ట్విస్టులు, సంచలనాల తర్వాత 43మందితో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. భారీ ప్రక్షాళనలు చేపట్టిన ప్రధాని మోడీ పలువురు కీలక నేతలకు తన టీమ్‌లోకి వెల్‌కమ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

12మంది మహిళా మంత్రులు 27మంది వోబీసీలకు చోటు, ఐదుగురికి కేబినెట్ హోదా మరో 12మంది దళితులకు అవకాశం ఐదుగురు మైనార్టీ మంత్రుల్లో ముగ్గురికి కేబినెట్ హోదా ఇవీ మోడీ నయా టీమ్‌లో మార్పులు.! ఉదయం నుంచీ ఎవరా నయా మినిస్టర్స్ అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది.

ముందుగా నారాయణ రాణె(మహారాష్ట్ర) మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అనంతరం సర్బానంద సోనోవాల్ (అసోం), వీరేంద్ర కుమార్ (మధ్యప్రదేశ్), జ్యోతిరాధిత్య సింధియా(మధ్యప్రదేశ్), రామచంద్ర ప్రసాద్ సింగ్(బీహార్), అశ్వనీ వైష్ణవ్ (ఒడిశా), పశుపతి కుమార్ పారస్(బీహార్), కిరణ్ రిజుజు(అరుణాచల్ ప్రదేశ్), రాజ్ కుమార్ సింగ్ (బీహార్), హరిదీప్ సింగ్ పూరి( ఢిల్లీ), మన్‌సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయా(గుజరాత్), భూపేంద్ర యాదవ్(రాజస్థాన్), పురుషోత్తం రూపాలా(గుజరాత్), కిషన్ రెడ్డి( తెలంగాణ),అనురాగ్ ఠాకూర్ (హిమాచల్ ప్రదేశ్), పంకజ్ చౌదరి (ఉత్తరప్రదేశ్),అనుప్రియ పటేల్ (ఉత్తరప్రదేశ్), సత్యపాత్ సింగ్ బఘేల్(ఉత్తరప్రదేశ్), రాజీవ్ చంద్రశేఖర్( కర్ణాటక), శోభా కరంద్లాజె(కర్ణాటక), భానుప్రతాప్ సింగ్ వర్మ(ఉత్తరప్రదేశ్).

దర్శన విక్రమ్ జర్దోష్(గుజరాత్), మీనాక్షి లేఖి(ఢిల్లీ),అన్నపూర్ణ దేవి యాదవ్(జార్ఖండ్), నారాయణస్వామి(కర్ణాటక),కౌశల్ కిశోర్(ఉత్తరప్రదేశ్), అజయ్ భట్ (మధ్యప్రదేశ్), బీఎల్ వర్మ(ఉత్తరప్రదేశ్),అజయ్ కుమార్(ఉత్తరప్రదేశ్), దేవ్ సింహ్ చౌహాన్(గుజరాత్),భగవంత్ ఖూబా(కర్ణాటక), కపిల్ మోరేశ్వర్(మహారాష్ట్ర), ప్రతిమ భౌమిక్(త్రిపుర), భగవత్ కృష్ణరావ్ కరాడ్(మహారాష్ట్ర), రాజ్ కుమార్ రంజన్ సింగ్(మణిపూర్), భారతి పవార్(మహారాష్ట్ర), విశ్వేశ్వర్ తుడు(ఒడిశా), మహేంద్ర భాయ్ ముంజపరా(గుజరాత్), జాన్ బర్లా(బెంగాల్), ఎల్. మురుగన్( తమిళనాడు), నిశిత్ ప్రామాణిక్(బెంగాల్), మంత్రులుగా ప్రమాణం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories