పార్లమెంట్‌లో కరోనా కలకలం.. 400 మంది సిబ్బందికి పాజిటివ్

Parliament: మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ పార్లమెంట్‌‌లో కోవిడ్ కలకం రేపింది.

Arun Chilukuri
Published on: 9 Jan 2022 3:49 PM IST
400 Parliament Staff Test Positive for Coronavirus
X

పార్లమెంట్‌లో కరోనా కలకలం.. 400 మంది సిబ్బందికి పాజిటివ్

Parliament: మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ పార్లమెంట్‌‌లో కోవిడ్ కలకం రేపింది. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నాలుగు వందల మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. పార్లమెంట్‌లో 14వందల 9మంది పనిచేస్తుండగా జనవరి 4 నుంచి 8 మధ్య చేసిన టెస్టుల్లో 400 మందికి వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన సిబ్బందిలో వేరియంట్ ఏదో తెలుసుకోవడానికి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్టు అధికారులు తెలిపారు. ఇక పాజిటివ్ వచ్చిన వారిలో లోక్‌సభలో 200 మంది. రాజ్యసభలో 69 మంది, 133 అనుబంధ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story