Marriage: పెళ్లి తర్వాత అమ్మాయిల్లో 4 సహజ మార్పులు.. అవేంటంటే..?

4 Natural Changes in Girls After Marriage in India
x

Marriage: పెళ్లి తర్వాత అమ్మాయిల్లో 4 సహజ మార్పులు.. అవేంటంటే..?

Highlights

Marriage: మహిళలైనా, పురుషులైనా పెళ్లయిన తర్వాత వారి జీవితం మారిపోతుంది.

Marriage: మహిళలైనా, పురుషులైనా పెళ్లయిన తర్వాత వారి జీవితం మారిపోతుంది. ముఖ్యంగా అమ్మాయిలు అత్తమామల ఇంటికి వెళ్లగానే పూర్తిగా మారిపోతారు. బాల్యం నుంచి యుక్తవయస్సు వరకు ఒకలా, పెళ్లి తర్వాత మరొకలా ఉంటారు. రూపం, రంగు, ఆకృతి, వ్యక్తిత్వంలో చాలా మార్పులు ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత అమ్మాయిలలో వచ్చే మార్పులు, దాని వెనుక ఉన్న కారణాల గురించి తెలుసుకుందాం.

పెళ్లయిన తర్వాత చాలా మంది అమ్మాయిల రూపురేఖలు మారిపోతాయి. ఇంటి బాధ్యత మొత్తం ఆమెపైనే ఉంటుంది. దీంతో వారి ఆరోగ్యం, అభిరుచులపై దృష్టి సారించలేరు. అందుకే చాలామంది పెళ్లి తర్వాత బరువును పెరుగుతారు మరికొంతమంది తగ్గుతారు. అంతేగాక పని ఒత్తిడి వల్ల ఆమె అందం కూడా కళావిహీనమవుతుంది. దీంతో ముఖంలో మార్పులు సంభవిస్తాయి. పెళ్లైన అమ్మాయిలపై చాలా ఆంక్షలు ఉంటాయి.

చాలా మంది యువతులు వివాహం తర్వాత వారి డ్రెస్సింగ్‌ స్టైల్‌ మార్చుకుంటారు. అమ్మ ఇంట్లో షార్ట్, జీన్స్, స్కర్ట్‌లతో తిరిగే అమ్మాయిలు పెళ్లయిన తర్వాత ప్రతిరోజూ చీర లేదా సల్వార్ సూట్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా కుంటుంబాల్లో కోడళ్ల దుస్తుల విషయంలో పాత ఆలోచనలే కొనసాగుతున్నాయి. దీనికి కారణం సామాజిక ఒత్తిడి. ఎందుకంటే కొత్త కోడలు దుస్తుల విషయంలో అత్తగారికి ఇబ్బంది లేకపోయినా బంధువులు, ఇరుగుపొరుగు వారు చేసే హేలనని భరించలేకపోతారు.

అంతేగాక పెళ్లికి ముందు అమ్మాయిలు చాలా ఇష్టంగా తిరిగేవారు కానీ పెళ్లి తర్వాత ఎక్కడికి వెళ్లకూడదు. సవాలక్ష ఆంక్షలు ఉంటాయి. ఇష్టాలకు, అభిరుచులకు విలువ ఉండదు. ఎంతసేపు కుటుంబం, పిల్లలకే అంకితమై ఉంటారు. దీనికి కారణం ప్రాచీన కాలం నుంచి ఉన్న సంప్రదాయాలు. పెళ్లికి ముందు వారికి చాలా సమయం ఉండేది కానీ పెళ్లి తర్వాత వారి మొదటి ప్రాధాన్యతగా ఇల్లు మాత్రమే.

Show Full Article
Print Article
Next Story
More Stories