Coronavirus: కేరళలో 164 కు చేరిన కరోనా కేసులు

Coronavirus: కేరళలో 164 కు చేరిన కరోనా కేసులు
x
Coronavirus cases increased in Kerala
Highlights

కేరళలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృభిస్తోంది. శుక్రవారం కొత్తగా 39 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

కేరళలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృభిస్తోంది. శుక్రవారం కొత్తగా 39 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.. ఈ విషయాన్నీ స్వయంగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 164 కు చేరుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. కొత్తగా నమోదైన 39 కేసులలో 34 కేసులు ఉత్తరాన ఉన్న కాసరాగోడ్ జిల్లాలో నమోదైనట్టు తెలిపారు. శుక్రవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో కోవిడ్ -19 సమీక్షా సమావేశం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా అధికారులు ఆయనకు వివరాలు అందించారు. అనంతరం విలేకరులతో ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు.

ఈ కేసులలో కొత్తగా కన్నూర్ నుంచి రెండు కేసులు నమోదయ్యాయని, త్రిస్సూర్, కోజికోడ్, కొల్లం నుంచి ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్టు స్పష్టం చేశారు. తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,10,299 మంది నిఘాలో ఉన్నారని, 616 మంది వివిధ ఆసుపత్రుల ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారని తెలిపిన ముఖ్యమంత్రి.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని సూచించారు. ఎవరికీ వేరే ప్రాంతాలకు వెళ్లే అనుమతి లేదని అందువల్ల ఎవరు కూడా బయట తిరగరాదని తెలిపారు. బయట ఆకతాయిగాస్ తిరిగే వాళ్లపై కేసులు కూడా పెట్టాలని ఆదేశించారు.

మరోవైపు సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం కలిగించే విషయాలలో, రాష్ట్రంలోని వివిధ ఐటి పార్కులలోని అనేక ఐటి కంపెనీలలో పనిచేసే టెకీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి సాంకేతిక సహాయం అందించడానికి ప్రభుత్వ యంత్రాలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

తిరువనంతపురంలో జిల్లా వైద్య అధికారి చేసిన అభ్యర్థన ఆధారంగా, 10 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మొబైల్ యాప్స్, సాఫ్ట్‌వేర్ మరియు ఇతర స్వచ్ఛంద సహాయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖకు అందిస్తున్నారు. వ్యాధి ముప్పు ముగిసే వరకు వారు డిఎంఓ కార్యాలయంలో పని చేయనున్నారు. ప్రస్తుతం ఆరోగ్య శాఖకు సంబంధించి ఓ యాప్ తయారు చేస్తున్నారు.

లాక్డౌన్ సమయంలో రైతులు, అమ్మకందారులు మరియు వినియోగదారులను అనుసంధానించడానికి ఐటి సేవలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో సహకరించడానికి టెక్కీ వాలంటీర్లతో వ్యవసాయ డైరెక్టర్ కె వాసుకి శుక్రవారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వినియోగదారులు మరియు రైతు నష్టపోకుండా ఉండటానికి టెకీలు ఒక యాప్ ను అభివృద్ధి చేయాలనీ టెక్కీలకు అధికారులు సూచించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories