Corona Cases in India: గడిచిన 24 గంటలలో 38,948 కొత్త కేసులు

Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 40వేల పైనే ఉంటోన్న కేసులు

Sandeep Eggoju
Published on: 6 Sept 2021 10:39 AM IST
38,948 New Coronavirus Reported in India Today 06 09 2021
X

Representational Image

Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 40వేల పైనే ఉంటోన్న కేసులు.. తాజాగా ఆ మార్క్‌ దిగువకు పడిపోయాయి. అటు మరణాల్లోనూ భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 38వేల, 948 కొత్త కేసులు బయటపడగా.. 219 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.30కోట్లు దాటింది. ఇక ఇప్పటివరకు 4లక్షల, 40వేల, 752 మందిని వైరస్‌ బలితీసుకుంది. గడిచిన 24 గంటల్లో 43వేల,903 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 97.44శాతంగా ఉంది. ప్రస్తుతం 4లక్షల, 4వేల, 874 చికిత్స తీసుకుంటున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story