Corona Cases in India: భారత్‌లో తగ్గిన కరోనా కేసులు

* కొత్తగా 38,628 పాజిటివ్ కేసులు నమోదు * గడిచిన 24 గంటల్లో 617 మంది మృతి * 4,12,153కు చేరిన యాక్టివ్ కేసులు

Sandeep Reddy
Published on: 7 Aug 2021 11:54 AM IST
38,628 New Coronavirus Reported in India Today 07 08 2021 | Today Corona Cases in India
X

Representation Photo

Corona Cases in India: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా 40 వేలకు పైగా నమోదైన రోజువారీ కేసులు నిన్నటితో పోలిస్తే ఆరు వేలు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 38 వేల 628 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఓ వైపు కేసులు తగ్గుముఖం పడితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. 24 గంటల్లో 617 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కోవిడ్ మరణాల సంఖ్య 4 లక్షల 27 వేల 371కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 12 వేల యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story