భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 27 Oct 2020 10:11 AM IST
భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు
X

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. దేశంలో కరోనా కేసులు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. తొలిసారిగా 40 వేల దిగువన కేసులు నమోదయ్యాయి. దేశంలో కేసుల సంఖ్య 79 లక్షల 46 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 36,470 కేసులు నమోదు కాగా, 488 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 63,842 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 79,46,429 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,25,857 ఉండగా, 72,01,070 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,19,502 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 90.62 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.50 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.88 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 9,58,116 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 10,44,20,894 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story