Corona Cases in India: 24 గంటల్లో 30 వేల 549 కేసులు నమోదు
Corona Cases in India: 422 మంది కొవిడ్‌తో మృతి * 24గంటల్లో 38 వేల మంది డిశ్చార్జ్
Representational Image
Corona Cases in India: మూడు,నాలుగు రోజులుగా భయపెట్టిన కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కసారిగా 10 వేలకు పైగా కేసులు తగ్గాయి. మృతులసంఖ్యలో మాత్రం మార్పు లేదు. పాజిటీవిటీ రేటు 1.28 గా నమోదైంది. రికవరీ రేటు 97.38 శాతంగా కొనసాగుతోంది.
కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి.మొన్నటిదాకా 40 వేలకు పైగా నమోదైన కేసులు ఒక్కసారిగా దిగొచ్చాయి. 24 గంటల్లో 30 వేల 549 కరోనా కేసులు నమోదయ్యాయి. 422 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 24గంటల్లో 38 వేల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కేరళ, మహారాష్ట్రలో కొత్త కేసులు భారీగా పడిపోవడమే తగ్గుదలకు కారణం. అక్కడ వరుసగా 13,984, 4,869 కేసులు వచ్చాయి. ప్రస్తుతం 4 లక్షల 4 వేల మంది కొవిడ్‌తో బాధపడుతన్నారు. ఇక నిన్న 61లక్షల మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 47 కోట్ల 85 లక్షలకు చేరింది.
Next Story




