Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 30,548 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 16 Nov 2020 9:58 AM IST
Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 30,548 కరోనా పాజిటివ్ కేసులు
X

India: భారత్‌లో‌ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దేశంలో కేసుల సంఖ్య 88 లక్షల 45 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 30,548 కేసులు నమోదు కాగా, 435 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 43,851 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 88,45,127 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,65,478 ఉండగా, 82,49,579 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,30,070 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 93.27 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.47 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 5.26 శాతంగా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story