దేశంలో కరోనా అత్యధికంగా ఉన్న జిల్లాల జాబితాలో ఐదు ఏపీ జిల్లాలు!

దేశంలో కరోనా అత్యధికంగా ఉన్న జిల్లాల జాబితాలో ఐదు ఏపీ జిల్లాలు!
x
Highlights

కరోనా మహామ్మారి గణాంకాలు ఆంధ్రప్రదేశ్ ను భయపెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాల్లో ఏపీలోని ఐదు జిల్లాలు ఉన్నాయి. గతంతో...

కరోనా మహామ్మారి గణాంకాలు ఆంధ్రప్రదేశ్ ను భయపెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాల్లో ఏపీలోని ఐదు జిల్లాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే రాష్ర్టంలో కరోనా విజృంభణ చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలి. రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 71 లక్షల 96 వేల 628 మందికి పరీక్షలు నిర్వహించారు. మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. డిశ్చార్జ్ కేసుల సంఖ్య పాజిటివ్ కేసులకు రెట్టింపు ఉన్నాయి. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కరోనా విజృంభణ కొనసాగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ర్టంలో కరోనా రికవరిలోనూ ఏపీ దూసుకుపోతున్నట్లు రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. తాజా లెక్కల ప్రకారం రాష్ర్టంలో 94.52 శాతం రికవరి రేటు నమోదయ్యింది. దేశ సగటు రికవరి రేటులో 87.78గా నమోదైంది.

రాష్ట్రంలో కొత్తగా 3,503 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,89,553కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 28 మంది మృతి చెందగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,481 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 33,396 యాక్టివ్ కేసులుండగా 7,49,676 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 71.96 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తూర్పు గోదావరిలో 457, పశ్చిమ గోదావరిలో 524 కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో ముగ్గురు చనిపోయారు. అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో వెల్లడించింది.

మొత్తం 30 జిల్లాల జాబితా ఇదే...

తూర్పు గోదావరి

పశ్చిమ గోదావరి

గుంటూరు

ప్రకాశం

చిత్తూరు

చెన్నై

తిరువళ్లూరు

కోయంబత్తూరు

చెంగల్పట్టు

సేలం

పుణే

నాగ్ పూర్

ఠాణే

అహ్మద్ నగర్

ముంబయి

తుముకూరు

మైసూర్

బెంగళూరు అర్బన్

దక్షిణ కన్నడ

హసన్

24 ఉత్తర పరగణాలు

24 దక్షిణ పరగణాలు

హుగ్లీ

హౌరా

కోల్ కతా

త్రిసూర్

తిరువనంతపురం

కోజికోడ్

ఎర్నాకుళం

మళప్పురం

Show Full Article
Print Article
Next Story
More Stories