బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రికి మూడేళ్ల జైలు

X
Highlights
బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే కు ఢిల్లీ కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. 1999లో...
Arun Chilukuri26 Oct 2020 9:16 AM GMT
బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే కు ఢిల్లీ కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. 1999లో జార్ఖండ్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో దిలీప్ రే దోషిగా తేలారు. వాజ్ పేయి ప్రభుత్వంలో దిలీప్ రే ఇందన శాఖ మంత్రిగా పని చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో పాటు నిందితుల వాదనలు విన్న ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. బొగ్గు కుంభకోణంతో సంబంధం ఉన్న ఇద్దరు సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యనంద్ గౌతమ్, కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్ కు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి పది లక్షల జరిమానా విధించింది కోర్టు.
Web Title3 Years Jail For Ex-Minister Dilip Ray For Coal Scam
Next Story