కాశ్మీర్ లో మరో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

కాశ్మీర్ లో మరో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
x
Highlights

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి తుపాకీ తూటా పేలింది. శ్రీనగర్‌లోని బాట్‌మలూ ప్రాంతంలో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదులు..

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి తుపాకీ తూటా పేలింది. శ్రీనగర్‌లోని బాట్‌మలూ ప్రాంతంలో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదులు సిఆర్‌పిఎఫ్ జవాన్లపై జరిపిన కాల్పుల్లో ఒక మహిళ మృతిచెందారు. బాట్‌మలూ ప్రాంతంలో ఉగ్రవాదులను ఉన్నారన్న సమాచారంపై భద్రతా దళాలు తెల్లవారుజామున 2.30 గంటలకు సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించాయి. ఇంతలో, ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. దీంతో ప్రతీకారంగా భద్రతా దళం కూడా ఎన్కౌంటర్ ప్రారంభించి ముగ్గురిని మట్టుబెట్టింది. కాగా అంతకుముందు సెప్టెంబర్ 5 న బారాముల్లాలో కూడా భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.

వారి వద్దనుంచి 2 ఎకె -47 లు, 2 పిస్టల్ లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇదిలావుంటే పాకిస్తాన్ నుండి ఉగ్రవాద అక్రమ చొరబాట్ల సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం గత కొన్ని నెలలుగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది శ్రీనగర్ ప్రాంతంలో జరిగిన 7 ఎన్‌కౌంటర్లలో 16 మంది ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ కాశ్మీర్ డిజిపి దిల్‌బాగ్ సింగ్ అన్నారు. అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా 72 ఆపరేషన్లలో 177 మంది ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసినట్టు డీజీపీ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories