3 Terrorists Killed in Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Arun Chilukuri
Updated on: 29 Jun 2020 10:46 AM IST
3 Terrorists Killed in Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
X

3 Terrorists Killed in Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లా ఖుల్‌ చొహార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో సోమవారం ఉదయం పోలీసులు సాయుధ బలగాల సాయంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు.

భద్రతా దళాల కాల్పుల్లో సోమవారం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. జమ్మూకశ్మీర్ లో ఇటీవల వరుసగా సాగుతున్న ఎదురుకాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనికబలగాలతో కలిసి గాలింపును ముమ్మరం చేశాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story