logo
జాతీయం

24 గంటల్లోనే తడాఖా చూపిన ఇండియన్ ఆర్మీ.. రాహుల్ హంతకుల ఎన్ కౌంటర్..

3 Terrorists Involved in the Murder of Rahul Bhat Have Been Encountered
X

24 గంటల్లోనే తడాఖా చూపిన ఇండియన్ ఆర్మీ.. రాహుల్ హంతకుల ఎన్ కౌంటర్..

Highlights

Rahul Bhat: కేవ‌లం 24 గంట‌ల్లోనే భార‌త సైన్యం త‌న త‌డాఖా చూపించింది.

Rahul Bhat: కేవ‌లం 24 గంట‌ల్లోనే భార‌త సైన్యం త‌న త‌డాఖా చూపించింది. క‌శ్మీరీ పండిట్ ఉద్యోగి రాహుల్ భ‌ట్‌ను హ‌త్య చేసిన ఉగ్రవాదుల‌ను ఇండియన్ ఆర్మీ ఎన్‌కౌంట‌ర్ చేసింది. రాహుల్ భ‌ట్‌ను చంపిన ఉగ్రవాదుల‌ను 2 రోజుల్లోగా గుర్తించి, ఎన్‌కౌంట‌ర్ చేస్తామ‌ని ఆర్మీ ఆయ‌న భార్యకు హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన ఒక్క రోజులోనే భార‌త సైన్యం రాహుల్ భ‌ట్‌ను చంపిన ఉగ్రవాదులను హతం చేసింది. బందీపూరాలో ముగ్గురు ఉగ్రవాదుల‌ను ఆర్మీ మ‌ట్టుబెట్టింది. ఈ ముగ్గురిలో ఇద్దరు రాహుల్ భ‌ట్‌ను హ‌త్య చేయ‌డంలో పాత్ర పోషించిన వారేన‌ని అధికారులు స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు తహసీల్దార్‌ కార్యాలయంలోని చొరబడి కశ్మీర్‌ పండిట్‌ ఉద్యోగి రాహుల్ భట్ ను కాల్చి చంపారు.

Web Title3 Terrorists Involved in the Murder of Rahul Bhat Have Been Encountered
Next Story