Ashish Mishra: మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఆశిశ్ మిశ్రా

Ashish Mishra: మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఆశిశ్ మిశ్రా

Arun Chilukuri
Published on: 11 Oct 2021 5:15 PM IST
3 Days Police Custody For Ashish Mishra
X

Ashish Mishra: మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఆశిశ్ మిశ్రా

Ashish Mishra: లఖీంపూర్‌ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు మూడు రోజుల కస్టడీ విధించారు. నలుగురు రైతుల సహా 8మంది మృతికి దారితీసిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 9న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసిన తర్వాత స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది.

లఖీంపూర్‌ ఖేరీ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ మౌన దీక్ష పాటించింది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని GPO పార్క్ వద్ద ప్రియాంక గాంధీ మౌనదీక్ష చేపట్టారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ, పార్టీ కార్యకర్తలు మౌనదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story