అమె వయస్సు 67 ఏళ్లు.. అతడి వయస్సు 28 ఏళ్లు.. సహజీవనం చేసేందుకు..

28 Year Old Youth Falls in Love With 67 Year Old Woman
x

అమె వయస్సు 67 ఏళ్లు.. అతడి వయస్సు 28 ఏళ్లు..

Highlights

Love Story: అమె వయస్సు 67 ఏళ్లు.. అతడి వయస్సు 28 ఏళ్లు.. ప్రేమలో పడ్డారు.

Love Story: అమె వయస్సు 67 ఏళ్లు.. అతడి వయస్సు 28 ఏళ్లు.. ప్రేమలో పడ్డారు. సహజీవనానికి సిద్ధమయ్యారు. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని ఈ జంట నిరూపించింది. అంతేకాదు తమ బంధాన్ని గుర్తించాలంటూ గ్వాలియర్‌ జిల్లా కోర్టుకు నోటరీ కోసం వచ్చి అదరినీ షాక్‌కు గురిచేసిందీ జంట. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లా కైలారస్‌లో జరిగింది. ఇప్పుడు ఈ జంట గురించి ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆ జంట విషయమేమిటో ఇప్పుడు చూద్దాం.

మోరేనా జిల్లాలోని కైలారస్‌లో ఒకే ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల రాంకలి, 28 ఏళ్ల భోలు మధ్య ప్రేమ చిగురించింది. రెండు జనరేషన్ల మధ్య పుట్టిన ఈ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఆ జంట తపిస్తోంది. వివాహం చేసుకోకుండానే కలిసి ఉండాలనుకుంటున్న ఆ జంట గ్వాలియర్‌ జిల్లా కోర్టును ఆశ్రయించింది. తమ సహజీవనానికి సంబంధించి నోటరీ చేయాలని కోరింది. ఈ విషయం తెలిసి స్థానికులు అవాక్కయ్యారు. అయితే తమ బంధంపై భవిష్యత్తులో ఎలాంటి గొడవలు రాకూడదని ఆ జంట భావించింది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా నోటరీ చేయించుకునేందుకు కోర్టుకు వచ్చినట్టు జంట తెలిపింది. సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నవారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు రాకుండా ఉండేందుకు సహజంగా ఇలాంటి నోటరీలు చేయించుకుంటారు. అయితే ఇలాంటి నోటరీలు అధికారికంగా చెల్లవని న్యాయనిపుణులు చెబుతున్నారు.Show Full Article
Print Article
Next Story
More Stories