Punjab: నిరుద్యోగులకు ఆప్ సర్కార్ శుభవార్త.. జంబో నోటిఫికేషన్..

Punjab Govt Jobs 2022: పంజాబ్‌లో అనూహ్య విజయం సాధించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఆప్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది.

Arun Chilukuri
Updated on: 5 May 2022 9:00 PM IST
26454 Vacancies to be recruited in Various Depts in Punjab
X

Punjab: నిరుద్యోగులకు ఆప్ సర్కార్ శుభవార్త.. జంబో నోటిఫికేషన్.. 

Punjab Govt Jobs 2022: పంజాబ్‌లో అనూహ్య విజయం సాధించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఆప్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. 26వేల, 454 ఉద్యోగాలను జంబో నోటిఫికేషన్ జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆప్ ప్రభుత్వం. ఇందులో 25 శాఖలకు చెందిన ఖాళీలను నింపుతామని ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియచేసింది. ఖాళీల ప్రకటన జారీ చేసిన రెండు రోజుల్లోనే దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

పంజాబ్ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వైబ్‌సైట్‌లో ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. వివిధ రకాల ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. పోలీసుశాఖలో అత్యధికంగా 10,314 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆ తర్వాత విద్యాశాఖలో 6,452, ఆరోగ్యశాఖలో 2,188 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story