Corona Cases: క‌ర్ణాట‌క‌లో క‌రోనా క‌ల్లోలం..24గంట‌ల్లో 626 మంది మృతి

Karnataka Corona Cases: క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది.

Samba Siva Rao
Published on: 23 May 2021 10:28 PM IST
Karnataka Corona cases
X

కరోనా వైరస్

Karnataka Corona Cases: క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది. ఉత్త‌రాది రాష్ట్రాల్లో క‌రోనా కాస్త త‌గ్గుముఖం పెట్టిన‌ప్ప‌టికి.. ద‌క్షిణాదిలో మాత్రం ఏపీ, కర్ణాటకలో కరోనా మృత్యుభేరి మోగిస్తుంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 25,979 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,23,904కి చేరింది. కరోనా మహమ్మారి కారణంగా తాజాగా 626 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం 4.72 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. పాజిటిటీ రేటు 20.76 శాతం కాగా.. మరణాల రేటు 2.40శాతంగా ఉన్నట్లు బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25,282కి పెరిగింది. ఇవాళ మరో 35,573 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story