Delhi News: గోడపై మూత్రం పోశాడని యువకుడి హత్య..

Delhi News: ఢిల్లీలో జరిగిన దారుణ హత్య కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Updated on: 13 Aug 2022 9:00 PM IST
25-year-old Stabbed to Death in Delhi Malviya Nagar
X

Delhi News: గోడపై మూత్రం పోశాడని యువకుడి హత్య..

Delhi News: ఢిల్లీలో జరిగిన దారుణ హత్య కలకలం రేపుతోంది. ఓ ఇంటి గోడపై మూత్రం పోయడం ఈ హత్యకు దారితీసింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఓ ఇంటి గోడపై 25 ఏళ్ల మయాంక్ అనే హోటల్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్ మూత్రం పోశాడు. ఇది గమనించిన ఆ ఇంటి యజమానురాలు మయాంక్‌ను మందలించింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆమెను మయాంక్ దుర్భాషలాడటంతో వివాదం పెద్దదైంది. ఈ క్రమంలో ఆమె కొడుకు మనీష్.. మయాంక్ పరస్పరం దాడికి పాల్పడ్డారు. మనీష్‌కు తోడుగా వచ్చిన అతని స్నేహితులు మయాంక్‌ను కత్తులతో పొడిచి హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story