Madhya Pradesh: బోరుబావిలో పడిన చిన్నారి

2.5 Year Old Girl Falls Into 300 Feet Deep Borewell in Madhya Pradesh
x

Madhya Pradesh: బోరుబావిలో పడిన చిన్నారి

Highlights

Madhya Pradesh: బోరుబావిలో పడిన చిన్నారి

Madhya Pradesh: బోరుబావుల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో జరిగినా.. జనాల తీరు మాత్రం మారడం లేదు. ఎక్కడో చోట అలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని సిహోరిలో ఓ రెండున్నరేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సిహోరిలో 3 వందల అడుగులు ఉన్న బోరుబావిని మూడు నెలల క్రితం తవ్వారు. అయితే అప్పటినుంచి ఆ బావిని పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. అయితే రాణి అనే చిన్నారి వ్యవసాయక్షేత్రంలో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు అందులో పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రమాదం జరిగిన స్పాట్‌కు చేరుకున్న అధికారులు, NDRF బృందాలు పాపను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. జేసీబీలతో బావికి సమాంతరంగా తవ్వుతున్నారు. 3 వందల లోతులో పడిపోవడంతో పాపకు ఆక్సిజన్‌ పంపే ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories