Bangladesh: బంగ్లాదేశ్ లో ఘోర పడవ ప్రమాదం.. 25 మంది మృతి

Bangladesh: పద్మ నదిలో దాదాపు 30 మంది ప్రయాణిస్తున్న ఓ పడవను ఇసుక రవాణా చేస్తోన్న పడవ ఢీ కొట్టింది.

Kranthi
Published on: 3 May 2021 12:44 PM IST
25 People Died in Bangladesh Boat Accident
X
బాంగ్లాదేశ్ బోట్ ప్రమాదం 

Bangladesh: బంగ్లాదేశ్ లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే...పద్మ నదిలో దాదాపు 30 మంది ప్రయాణిస్తున్న ఓ పడవను ఇసుక రవాణా చేస్తోన్న పడవ ఢీ కొట్టింది. మిగిలిన వారిలో 5గురిని కాపాడినట్లు స్థానిక పోలీసు అదికారి మిరాజ్ హుస్సేన్ తెలిపారు. మరి కొందరి ఆచూకీ తెలియాల్సి వుందని వారి కోసం అగ్నిమాపక సిబ్బంది, స్థానిక రెస్క్య టీం గాలిస్తున్నట్లు ఆ అధికారు స్పష్టం చేశారు.

గత ఏప్రిల్‌ నెలలోనూ 50 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవను పెద్ద కార్గో ఓడ ఢీకొట్టిన ఘటన మరువకముందే ఇవాళ మరో ఘటన జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఇటీవల పడవ ప్రమాదాలు జరగడం సర్వ సాధారణంగా మారింది. షిప్‌యార్డుల వద్ద భద్రతా ప్రమాణాల గురించి పట్టించుకోకపోవడం, రద్దీని పడవలు తట్టుకుంటాయా లేదా అనేది గమనించకపోవడం పరిపాటిగా మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Kranthi

Kranthi

Next Story