శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. బావిలో పడిపోయిన భక్తులు..

Ram Navami: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 30 March 2023 2:14 PM IST
25 Fall Into Stepwell At Indore Temple
X

శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. బావిలో పడిపోయిన భక్తులు.. 

Ram Navami: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి.. అందులో భక్తులు పడిపోయారు. ప్రస్తుతం వాళ్లను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఏడుగురిని వెలికి తీశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయం వద్ద మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికిపైగా బావిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story