logo
జాతీయం

Sidhu Moose Wala: అటాప్సీ రిపోర్ట్‌.. 2 నిమిషాల్లో 24 రౌండ్లు..

24 Bullet Wounds Found in Sidhu Moose Wala Autopsy
X

Sidhu Moose Wala: అటాప్సీ రిపోర్ట్‌.. 2 నిమిషాల్లో 24 రౌండ్లు..

Highlights

Sidhu Moose Wala: పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యపై దర్యాప్తు వేగంగా సాగుతోంది.

Sidhu Moose Wala: పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. అయితే దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్దూ శరీరంపై 24 చోట్ల బుల్లెట్ గాయాలున్నట్లు అటాప్సీ రిపోర్టులో తేలింది. కేవలం 2 నిమిషాలలోపే సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత సిద్దూ బౌతికదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

కన్నీటి నివాళి మధ్య సిద్దూ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో అభిమానులు, జనం హాజరయ్యారు. సెక్యూరిటీ తొలగించిన 24 గంటల్లోనే సిద్దూను దారుణంగా హత్య చేశారు దుండగులు. మాన్సాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మహేంద్ర థార్ వాహనంలో వెళ్తున్న అతడిని సుమారు 10 మంది చుట్టుముట్టి కాల్చారు. కెనడా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్నారు పోలీసులు.

Web Title24 Bullet Wounds Found in Sidhu Moose Wala Autopsy
Next Story