భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

Corona Cases in India: కొత్తగా 21,880 మందికి కరోనా

Rama Rao
Published on: 22 July 2022 11:24 AM IST
21,880 New Corona Cases in India | Corona Cases
X

భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 21వేల 880 కేసులు నమోదు కాగా వైరస్‌ బారిన పడి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 21వేల 219 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4కోట్ల 38లక్షల 47వేల 65కి చేరగా 4కోట్ల 31లక్షల 71వేల 653 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5లక్షల 25వేల 930 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో లక్షా 49వేల 482 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. నిన్న ఒక్కరోజే 37లక్షల 6వేల 997 మందికి టీకా ఇవ్వగా.. ఇప్పటివరకు 201.30 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది.

Rama Rao

Rama Rao

Next Story