Corona Cases: దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
*24గంటల్లో 21,566 కేసులు, 45 మరణాలు నమోదు
Corona Cases: దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
Corona Cases: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 21వేల 566 కోవిడ్ కేసులు, 45 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 18వేల 294 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4.38కోట్లు కాగా మొత్తం మరణాల సంఖ్య 5.25 లక్షలకు చేరుకుంది. కోలుకున్నవారి సంఖ్య 4.31 కోట్లు కాగా, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1.48 లక్షలుగా ఉన్నాయి. రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా యాక్టివ్ కేసులు 0.33 శాతం, రికవరీ రేటు 98.47 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
Next Story




