పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్
representative image
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు సహా వారికి సహకరిస్తున్న మరో వ్యక్తి హతమయ్యాడు. శనివారం ఉదయం పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో ఆర్మీ బలగాలు అవంతిపొరలో గోరిపోరా ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఇదే సమయంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు.ఈ క్రమంలో ఉగ్రవాదులు, ఆర్మీ బలగాల మధ్య జరిగిన కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు వారికి సహకరిస్తున్న వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story




