Uttar Pradesh: ఉన్నవోలో మరో దారుణం...
Uttar Pradesh: ఉన్నవోలో మరో దారుణం...
Uttar Pradesh: ఎంత కఠినంగా వ్యవహరించినా.. ఎన్ని చట్టాలు తెచ్చినా కొందరు మృగాలలో మార్పు రావడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉన్నావ్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నవోలోని బబురా గ్రామంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. పశువుల కోసం గడ్డి తీసుకువచ్చేందుకు పొలం వచ్చిన బాలికలపై దాడి జరిగిందని పోలీసులు అంటున్నారు. జిల్లా మెజిస్ట్రేట్ తోపాటు ఐజీ, డీఐజీ ఇతర ఉన్నతాధికారులు ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. గడ్డి తీసుకువచ్చేందుకు మధ్యాహ్నం వెళ్లిన సోదరి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తాము వెతకగా పొలంలోనే అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారని బాలిక సోదరుడు విశాల్ చెప్పారు.




