ఢిల్లీ రైతుల ఆందోళనల్లో కరోనా కలకలం

ఢిల్లీ రైతుల ఆందోళనల్లో కరోనా కలకలం
x
Highlights

ఢిల్లీ రైతుల ఆందోళనల్లో కరోనా కలకలం రేగింది. సింగు బోర్డర్‌ దగ్గర పోలీసు బలగాలకు నాయకత్వం వహిస్తున్న ఐపీఎస్‌ అధికారులు కోవిడ్ బారినపడ్డారు. డీసీపీ,...

ఢిల్లీ రైతుల ఆందోళనల్లో కరోనా కలకలం రేగింది. సింగు బోర్డర్‌ దగ్గర పోలీసు బలగాలకు నాయకత్వం వహిస్తున్న ఐపీఎస్‌ అధికారులు కోవిడ్ బారినపడ్డారు. డీసీపీ, అదనపు డీసీపీతో పాటు పలువురు ఢిల్లీ పోలీసులకు ఈ మహమ్మారి సోకింది. దీంతో వారిని వెంటనే స్థానిక కోవిడ్ ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు 15వ రోజు కొనసాగుతున్నాయి. వేలాది మంది రైతులు చలిని సైతం లెక్కచేయకుండా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే బందోబస్తులో ఉన్న పోలీసులకు కరోనా సోకడంతో రైతుల్లో కలవరం మొదలైంది. గుంపులుగా ఆందోళనల్లో పాల్గొనడం, మాస్క్‌ లేకపోవడం, భౌతిక దూరం, కరోనా నిబంధనలు పాటించకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు రైతులు.


Show Full Article
Print Article
Next Story
More Stories