దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..

Corona Cases In India: కొత్తగా 17,073 కరోనా కేసులు నమోదు

Jyothi
Updated on: 27 Jun 2022 1:15 PM IST
17,073 News Cases In India | Telugu News
X

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases In India: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రెండు రోజులుగా కాస్త తగ్గిన కొత్త కేసులు.. తాజాగా 45 శాతం పెరిగాయి. దాంతో కేసుల సంఖ్య మరోసారి 17 వేల మార్కు దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 94 వేలకు చేరింది.ఆదివారం 3.03 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..17,073 మందికి వైరస్ సోకిందని సోమవారం కేంద్రం వెల్లడించింది. దాంతో పాజిటివిటీ రేటు 5 శాతానికి చేరి, ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళలో కలిపి మొత్తం దాదాపు 10 వేల కేసులొచ్చాయి. తమిళనాడులో వెయ్యి దాటగా.. దిల్లీలో రెండువేలకు చేరువయ్యాయి.

తాజాగా వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 94,420కి చేరాయి. క్రియాశీల కేసుల రేటు 0.22 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.57 శాతానికి పడిపోయింది. నిన్న 15,208 మంది కోలుకున్నారు. 21 మంది మరణించారు. ఇప్పటివరకూ 4.34 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.27 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. 5.25 లక్షల మందికి పైగా మరణించారు. 197 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.


Jyothi

Jyothi

Next Story