దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోన్న కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 5 Jan 2021 8:07 PM IST
దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోన్న కరోనా కేసులు
X

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. వరసగా రెండో రోజు కూడా కొత్త కేసులు 17వేలకు దిగువనే నమోదయ్యాయి. రికవరీ కేసులు కోటి దిశగా పయనిస్తున్నాయి. కొత్తగా 9లక్షలకు పైగా పరీక్షలు చేయగా.. 16,375 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో నిన్నటివరకు దేశవ్యాప్తంగా 1,03,56,844 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, జూన్ 24న 16,922 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా రెండు రోజులుగా అదే స్థాయి తగ్గుదల కనిపిస్తోంది. క్రియాశీల కేసులు 2.31లక్షలకు చేరుకున్నాయి. ఆ రేటు 2.36 శాతానికి తగ్గింది. కొత్తగా మరో 2వందల మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య లక్షా 49వేలు దాటింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story