Kerala: జికా వైరస్‌ కలకలం.. 15 మందికి జికా సోకినట్టు నిర్ధారణ

14 Zika Virus Cases Reported in Kerala
x

(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

Highlights

Kerala: ఓ పక్క కరోనా.. మరోపక్క జికా వైరస్‌ కేరళను అతలాకుతలం చేస్తున్నాయి.

Kerala: ఓ పక్క కరోనా.. మరోపక్క జికా వైరస్‌ కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. మొదట 24 ఏళ్ల గర్భిణీలో జికా వైరస్‌ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే ల్యాబ్‌కు పంపగా ఆమెతో పాటు మరో 14 మందికి జికా సోకినట్టు తేలింది. మరోవైపు జికా ఇన్ఫెక్షన్‌ ప్రమాదకరం కాదని చెబుతున్న వైద్యులు మ్యుటేట్‌ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిసరని హెచ్చరిస్తున్నారు.

ఇక జికా వైరస్‌పై అప్రమత్తమైంది కేంద్ర ప్రభుత్వం. ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించింది. అక్కడి పరిస్థితులను సమీక్షించడంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందించనుంది. ఈ బృందంలో సీనియర్‌ వైద్యులతో పాటు అంటువ్యాధుల నిపుణులు ఉన్నారు. మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా జికాపై అలర్ట్‌ అయింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories