Chennai: 15 ఏళ్ల అక్కపై తమ్ముడు అఘాయిత్యం

Chennai: 15 ఏళ్ల బాలికపై ఆమె తమ్ముడు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు

Kranthi
Published on: 25 Feb 2021 8:39 AM IST
15-year-old sister raped by younger brother
X

ఇమేజ్ సోర్స్ : ది హన్స్ ఇండియా


chennai: రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వావి వరసలు మరిచి మనుషులు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకొని చెల్లికి తల్లికి తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సోదరిపై అత్యాచారం చేసిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.

15 ఏళ్ల బాలికపై ఆమె తమ్ముడు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన సంఘటన తమిళనాడులోని కన్నియాకుమారి జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక తండ్రి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. బాలిక తల్లి దివ్యాంగురాలు కాగా, ఆమెకు 14 ఏళ్ల తమ్ముడున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉంటున్న తమ్ముడు అక్కపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడంతో, ఆమెను ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో గర్భంతో ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో, చైల్డ్‌ లైన్‌ అధికారులు బాలికను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై కుళచ్చల్‌ మహిళా పోలీసులు విచారణ చేపట్టారు.

Kranthi

Kranthi

Next Story