Punjab New Cabinet: పంజాబ్‌లో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

Punjab New Cabinet: * చరణ్‌జీత్ సింగ్ చన్నీ టీమ్‌లో 15మందికి చోటు * మొదటిసారి పదవులు దక్కించుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలు

Arun Chilukuri
Updated on: 26 Sept 2021 8:08 PM IST
15 Ministers Were sworn-in CM Charanjit Singh Channi New Team in Punjab New Cabinet Meeting
X

చరణ్‌జీత్ సింగ్ చన్నీ (ఫోటో: ది హన్స్ ఇండియా) 

Punjab New Cabinet: పంజాబ్‌ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. సీఎం చరణ్‌జీత్‌సింగ్ చన్నీ కొత్త టీమ్‌లో మొత్తం 15 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చంఢీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో గవర్నర్ భన్వరీలాలవ్ ప్రమాణం చేయించారు.

ఇక చరణ్‌జీత్ నయా టీమ్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలు మొదటిసారి మంత్రి పదవులు దక్కించుకున్నారు. అయితే, ఇసుక కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా గుర్జీత్‌సింగ్‌కు మంత్రి పదవి ఇవ్వొద్దని ఆరుగురు ఎమ్మెల్యేలు లేఖలు రాసినా సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ రాణాకు మంత్రి పదవి కట్టబెట్టేందుకే మొగ్గుచూపారు.

మరోవైపు పంజాబ్ కొత్త మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో బ్రహ్మ మొహింద్రా, మన్‌ప్రీత్‌సింగ్ బాదల్, రాజిందర్‌సింగ్ బజ్వా, సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియా, రాణా గుర్జీత్‌సింగ్, అరుణ చౌదరి, రజియా సుల్తానా, భరత్ భూషణ్‌ అషు, విజయ్ ఇందర్ సింగ్లా, రణ్‌దీప్ సింగ్ నభా, రాజ్‌కుమార్ వెర్క, సంగత్ సింగ్ గల్జియాన్, ప్రగత్ సింగ్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, గుర్‌కీరత్ సింగ్ కోట్లీ ఉన్నారు. రాణా గుర్జీత్‌సింగ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో కూడా పనిచేయడం విశేషం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story