క‌ర్ణాట‌క‌లో భారీ పేలుడు : 15 మంది మృతి

Arun Chilukuri
Published on: 22 Jan 2021 2:13 PM IST
15 killed in Karnatakas Shivamogga dynamite blast
X

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హుసోడులో క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 15 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ శబ్ధం రావడంతో స్థానిక ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అబ్బలగిరి గ్రామానికి సమీపంలోని హునసోడు క్వారీలో ఈ పేలుడు సంభవించినట్లు చెబుతున్నారు.

ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గురువారం రాత్రి 10.20 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు తెలిసింది. పేలుడు ధాటికి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.

భారీ శబ్ధం, భూమి కంపించినట్లుగా అన్పించడంతో ప్రజలు భయంతో తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. మృతులను, క్షతగాత్రులను బయటకు తీసేపనిలో నిమగ్నమయ్యారు. మృతుల సంఖ్య భారీగా ఉండనుందని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story