26/11 Mumbai Attacks: ముంబై మారణ హోమానికి 14 ఏళ్లు పూర్తి

14 Years Complete For Mumbai Attack
x

26/11 Mumbai Attacks: ముంబై మారణ హోమానికి 14 ఏళ్లు పూర్తి

Highlights

26/11 Mumbai Attacks: భారత్‌తోపాటు మరో 14 దేశాలకు చెందిన మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ మారణ హోమం జరిగి నేటికి 14 ఏళ్లు పూర్తయింది.

26/11 Mumbai Attacks: నవంబర్‌ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రదాడితో యావత్‌ ప్రపంచం వణికిపోయిన విషయం తెలిసిందే. భారత్‌తోపాటు మరో 14 దేశాలకు చెందిన మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ మారణ హోమం జరిగి నేటికి 14 ఏళ్లు పూర్తయింది.

పాకిస్తాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు.. నవంబర్‌ 26, 2008 సాయంత్రం కొలాబా సముద్ర తీరం నుంచి ముంబైకి చేరుకున్నారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ముష్కరులు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌లో రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్‌లోకి చొరబడ్డారు. వెంటనే వారి చేతుల్లో ఉన్న ఏకే-47 తుపాకులను తీసి తూటాల వర్షం కురిపించారు. అక్కడ కన్పించిన వారినల్లా పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని ఘటనలతో వణికిపోయిన అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునే లోపే దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు.

అక్కడి నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్‌, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, తాజ్‌ హోటల్, లియోపోల్డ్‌ కేఫ్‌, నారిమన్‌ లైట్‌ హౌస్‌... ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారిలో కేవలం భారతీయులే కాకుండా మరో 14 దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.

26/11 ముంబై ఉగ్రదాడి 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం మాట్లాడుతూ ఉగ్రవాదం మానవాళికి ముప్పు తెస్తుందని అన్నారు. ఈరోజు, 26/11న, దాని బాధితులను స్మరించుకోవడంలో ప్రపంచం భారతదేశంతో కలిసింది. ఈ దాడికి ప్లాన్ చేసిన మరియు పర్యవేక్షించిన వారిని చట్టానికి తీసుకురావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద బాధిత ప్రతి ఒక్కరికీ మేము రుణపడి ఉంటాము' అని ఆయన ట్వీట్ చేశారు. 2008లో ఇదే రోజున సాయుధ ఉగ్రవాదులు ముంబైలోని పలు ప్రాంతాల్లో దాడి చేశారు. ఈ దాడుల్లో కనీసం 166 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

మంబై ఉగ్రదాడి కాగా, మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ శనివారం నాడు అమరవీరుల స్మారకాన్ని సందర్శించి 14 ఏళ్ల క్రితం ఇదే రోజున జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అధికారులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి దీపక్ కేసర్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనుకుమార్ శ్రీవాస్తవ, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రజనీష్ సేథ్, ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించేందుకు, పద్ధతులను సూచించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రజారోగ్య శాఖ శుక్రవారం అధికారులను ఆదేశించింది. టీకాపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మత పెద్దలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులను ప్రోత్సహించాలని యోచిస్తోంది. వ్యాధి వ్యాప్తి నియంత్రణలో ఉందని నిర్ధారించడానికి జిల్లాల వారీగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తానాజీ సావంత్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories