Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
Corona Cases in India: తాజాగా 13, 313 కరోనా కేసులు నమోదు
Corona Cases in India: దేశంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. రోజు వారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న భయాందోళనలు కలుగుతున్నాయి. తాజాగా 13 వేల 313 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇటు కరోనా వల్ల 38 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్‌లో 83 వేల 990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజు వారి పాజిటివిటీ రేటు 2.30 శాతంగా ఉంది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 33 లక్షల 44 వేల 958కి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 196.62 కోట్ల టీకాలను పంపిణీ చేశారు. దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు...
25 Jun 2022 10:50 AM GMTసర్కారు వారి పాట సన్నివేశాన్ని డిలీట్ చేశారు అంటున్న తమన్.. పరశురామ్...
25 Jun 2022 10:30 AM GMTవిషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMT