Chhattisgarh: ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎంను ఢీకొన్న ట్రక్కు, 13 మంది మృతి

Road Accident: ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న డీసీఎంను ట్రక్కు ఢీకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 May 2025 11:21 AM IST
13 Killed Several Injured as Truck Rams Trailer in Chhattisgarh
X

Chhattisgarh: ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎంను ఢీకొన్న ట్రక్కు, 13 మంది మృతి

Road Accident: ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న డీసీఎంను ట్రక్కు ఢీకొంది. ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు, నలుగరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ తెలిపారు.

బాధితులు ఓ వివాహ వేడుకకు హాజరై చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story