పెళ్లి వేడుకలో పెను విషాదం.. బావి స్లాబ్ కూలి 13 మంది మృతి..

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 17 Feb 2022 3:44 PM IST
13 Killed After Falling Into Well in Kushinagar
X

పెళ్లి వేడుకలో పెను విషాదం.. బావి స్లాబ్ కూలి 13 మంది మృతి..

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుషీనగర్ జిల్లా నెబువా నౌరంజియాలో ప్రమాదవశాత్తు బావిలో పడి 13 మంది మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నౌరంజియాలో వివాహ వేడుకలో భాగంగా కొంతమంది మహిళలు, యువతులు బావి పైకప్పుపై నిల్చున్నారు. అయితే బరువు అధికమవడంతో పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.

దీంతో అందరూ బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా. మరో 15 మందిని గ్రామస్తులు కాపాడరు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story