Nipah Virus - Kerala: కేరళలో మరోసారి నిఫా వైరస్‌ కలకలం

12-Year-Old Boy Dies of Nipah Virus in Kozhikode Kerala | National News Today
x

నిఫా వైరస్ (ఫోటో ది హన్స్ ఇండియా )

Highlights

Nipah Virus - Kerala: *కోజికోడ్‌లో నిఫా వైరస్‌తో 12 ఏళ్ల బాలుడు మృతి *నిఫా కలకలంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం

Nipah Virus - Kerala: కేరళలో నిఫా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ ప్రకటించారు. తీవ్ర అస్వస్థకు గురైన బాలుడికి చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. కాగా బాలుడి కుటుంసభ్యుల్లో ఎవరికీ లక్షణాలు లేవన్నారు మంత్రి వీణాజార్జ్‌. అటు బాలుడితో కాంటాక్ట్‌ ఉన్న వారందరినీ గర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు నిఫా కలకలంతో కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖకు సహకారంగా కేంద్రం తరపున ప్రత్యేక బృందం రాష్ట్రానికి చేరుకుంది.

కేరళలో 2018 జూన్‌లో తొలిసారి నిఫా వైరస్‌ వెలుగులోకి వచ్చింది. మొత్తం 23 కేసులను నిర్థారించారు. వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2019లోనూ మరోసారి ఒకరిలో వైరస్‌ నిర్ధారణ అయ్యింది. అప్రమత్తమైన ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఒక్క కేసుతోనే వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories