Coronavirus: వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్

12 Crore Doses of Vaccine Will be Available in June
x

కరోనా వ్యాక్సిన్(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )


Highlights

Coronavirus: కరోనా వ్యాక్సిన్ కోసం రోజులు నెలల తరబడి ఎదురు చూస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

Coronavirus: కరోనా వ్యాక్సిన్ కోసం రోజులు నెలల తరబడి ఎదురు చూస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా మేలో ఏడు కోట్ల 90 లక్షల డోసులు అందుబాటులో ఉంచగా వచ్చే నెల ఏకంగా నాలుగు కోట్ల డోసులు పెరగనున్నాయి. 12 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకాల వినియోగం జనాభా, వ్యాక్సిన్ వృధా వంటి వాటిని పరిగణలోకి తీసుకుని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు టీకాల సరఫరా ఉంటుందని ప్రకటించారు. జూన్ లో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా టీకా అందించేందుకు 6.09 కోట్ల డోసులను సరఫరా చేయనున్నారు. వాటికి అదనంగా 5.86 కోట్ల డోసులు రాష్ర్టాలు, ప్రైవేట్ ఆసుపత్రులు నేరుగా కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. టీకా డోసుల రవాణా, డెలివరి షెడ్యూల్ ముందుగానే రాష్ర్టాలకు తెలియచేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మే నెలలో 4.03 కోట్ల ఉచిత టీకా డోసులను రాష్ర్టాలకు అందచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో పాటు 3.90 కోట్ల డోసులు రాష్ర్టాలు నేరుగా కొనుగోలు చేసే విధంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 21 కోట్ల, 20 లక్షల 66 వేల 614 డోసుల టీకా పంపిణీ చేసినట్లు వెల్లడించింది. మే నెలతో పోలిస్తే జూన్ లో 50 శాతం అదనంగా టీకా డోసులు కేటాయించినట్లు చెప్పారు. టీకాల కొరత ఎదుర్కొంటున్న రాష్ర్టాల ఫిర్యాదుతో జూన్ నెలలో పది కోట్ల కొవిషీల్డ్ టీకాలను సరఫరా చేస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. జూన్ లో 6 కోట్ల 50 లక్షలు, జులైలో ఏడు కోట్లు, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో పది కోట్ల చొప్పున వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు సీరం సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అయితే జూన్‌లోనే ఉత్పత్తిని గణనీయంగా పెంచుతామని తాజాగా స్పష్టం చేసింది. దీనికి తోడు స్పుత్నిక్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు భారత్ బయోటెక్ కూడా కోవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచుతోంది. ప్రస్తుతం నెలకు కోటీ 30 లక్షల కోవాగ్జిన్‌ డోసులు ఉత్పత్తి జరుగుతోంది. అక్టోబర్‌ నుంచి నెలకు 10 కోట్ల డోసుల ఉత్పత్తికి ప్లాన్ చేస్తోంది. దీంతో కేంద్రం వ్యాక్సిన్‌ సప్లై విషయంలో గట్టి హామీ ఇస్తోంది. ఈ ఏడాది చివరికల్లా భారత్‌లో అందరికీ సరిపడా వ్యాక్సిన్‌ డోసులు అందివ్వగలమని చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories