Hindu Migrant Family Found Dead : ఒకే కుటుంబంలో 11మంది ఆత్మహత్య!

Hindu Migrant Family Found Dead : పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఒకే కుటుంబానికి చెందిన వారంతా కలిసి సాముహిక ఆత్మహత్యకి

Krishna
Published on: 9 Aug 2020 4:37 PM IST
Hindu Migrant Family Found Dead : ఒకే కుటుంబంలో 11మంది ఆత్మహత్య!
X
Police (File Photo)

Hindu Migrant Family Found Dead : పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఒకే కుటుంబానికి చెందిన వారంతా కలిసి సాముహిక ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఇందులో ఓ కుటుంబంలోని 12మంది విషం తాగి ఆత్మహత్యకి పాల్పడగా, 11మంది మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.. ఈ విషాదకరమైన ఘటన రాజస్థాన్‌లోని దేచు పోలీసు స్టేషన్‌ పరిధిలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. జోధ్‌పుర్‌ పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. కొంతకాలం కిందట పాకిస్థాన్‌ నుంచి ఓ హిందూ కుటుంబం జోధ్‌పుర్‌కు వచ్చి అక్కడ నివాసం ఉంటుంది. ఇక్కడ వీరు ఒక ఫాంహౌజును అద్దెకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

అయితే ఏమైందో ఏమో కానీ తమ ఇంటి సమీపంలో వారందరూ చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. వారందరూ విగత జీవులుగా పడివుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిశీలించగా.. వారిలో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా గుర్తించారు.. ఇక ఇంటి బయట ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలతో ఉన్నట్లుగా గుర్తించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే వారు ఎందుకు సాముహిక ఆత్మహత్యకి పాల్పడ్డారు అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.. పోలిసులు దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దీనిపైన జోధ్‌పుర్‌ జిల్లా ఎస్పీ రాహుల్‌ భర్హత్‌ మాట్లాడుతూ.. వారి ఆత్మహత్యలకి గల కారణాలు ఏమీ తెలియలేదని, వారి శరీరంపై కూడా ఎలాంటి గాయాల లేవని అన్నారు. ఇక ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తిని విచారిస్తే ఈ కేసుకి సంబంధించిన విషయాలు బయటకి వస్తాయని వెల్లడించారు. అటు మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు

Krishna

Krishna

Next Story