ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
x

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Highlights

*మొరాదాబాద్‌లో ట్రక్కు, మినీ బస్సు ఢీ *10 మంది మృతి, పలువురికి గాయాలు *ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్

మంచు పొరల మాటున మృత్యువు పొంచి ఉందని గ్రహించలేకపోయారు. దట్టంగా మంచు కురుస్తున్న వేళ ఒకదాన్ని మరో వాహనం ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూపీలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

యూపీలోని ఆగ్రా-మొరాబాద్ హైవేపై జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories