కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం

Arun Chilukuri
Published on: 19 Nov 2020 3:48 PM IST
కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం
X

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తిపై సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో ఏ ఒక్కరు మాస్కులు ధరించకుంటే రెండు వేల రూపాయలు జరిమాన విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఛట్ పూజ తో కరోనా వ్యపిందే అవకాశం ఉన్నందున పండుగలు, వేడుకలను ఇంటి దగ్గరే నిర్వహించుకోవాలని సూచించారు. ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు ఢిల్లీ వ్యాప్తంగా మార్కెట్లో మాస్కులు పంచాలని విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story