జేడీయూకు చిరాకు తెప్పించడంలో చిరాగ్ సక్సెస్ అయ్యారా ?

జేడీయూకు చిరాకు తెప్పించడంలో చిరాగ్ సక్సెస్ అయ్యారా ?
x
Highlights

గెలిచింది ఒక్క సీటు.. ఓడించింది 30 స్థానాలు ! ఇదీ బిహార్‌లో ఎల్జేపీ చేసింది. విజయం సాధించకపోయినా.. ఓట్లు చీల్చి... 32 స్థానాల్లో ఎన్డీఏ విజయావకాశాలను...

గెలిచింది ఒక్క సీటు.. ఓడించింది 30 స్థానాలు ! ఇదీ బిహార్‌లో ఎల్జేపీ చేసింది. విజయం సాధించకపోయినా.. ఓట్లు చీల్చి... 32 స్థానాల్లో ఎన్డీఏ విజయావకాశాలను దెబ్బతీశాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే బీజేపీ, జేడీయూ కూటమి చిరాగ్ చిరాకు తెప్పించారు.

ఎగ్టిట్ పోల్స్ ఫలితాలను తలకిందులు చేస్తూ బిహార్‌లో మళ్లీ ఎన్డీఏ అధికారాన్ని చేజిక్కించుకుంది. వన్ సైడ్‌లా అనిపించిన వార్ ఓ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించింది. ఐతే తర్వాత మళ్లీ ఫాంలోకి వచ్చిన బీజేపీ, జేడీయూ కూటమి ఎట్టకేలకు అధికార పీఠాన్ని అధిష్టించబోతోంది. అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్‌ ఆద్యంతం ఐపీఎల్ మ్యాచ్‌ను తలపించింది. ఎన్డీఏ కూటమికి 125 సీట్లు రాగా మహాఘట్‌బంధన్ 110 స్థానాలతో సరిపెట్టుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీ అద్భుతంగా మెరుగుపడినా అధికారాన్ని అందుకోవడంలో మాత్రం లాంతరు పార్టీని మళ్లీ దురదృష్టం వెక్కిరించింది.

జేడీయూ కంటే బీజేపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. ఐతే ఎవరు ఎక్కువ సీట్లు సాధించారన్నది సంబంధం లేదని నితీష్ కుమారే మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతాని కమలం పార్టీ నేతలు అంటున్నారు. ఈ లెక్కలు ఎలా ఉన్నా చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ మిగిల్చిన నష్టం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ప్రధాని మోడీ వల్లే ఎన్డీఏ విజయం సాధించింది అంటున్న చిరాగ్ పాశ్వాన్ జేడీయూ ఇప్పటికీ ఎప్పటికీ శత్రువే అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. ముందు నుంచి వార్ ప్రకటించిన చిరాగ్ ఫలితాల లెక్కలు చూస్తే జేడీయూ మీద ప్రతీకారం తీర్చుకున్నట్లే కనిపిస్తోంది.

దాదాపు 35స్థానాల్లో ఓట్లు చీల్చడంద్వారా ఎన్డీఏ విజయావకాశాలకు చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీ దెబ్బతీసినట్లుగా తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు ఆర్జేడీతో దోస్తీకి గుడ్ బై చెప్పి ఎన్డీయేలో చేరిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీపై కూడా ఎల్జేపీ ప్రభావం కనిపించింది. ఈ పార్టీ ఏడు స్థానాల్లో ఓడిపోతే మూడింట్లో పరాజయానికి చిరాగ్ పార్టీ ఓట్లు చీల్చడమే కారణమైంది. ఎల్జేపీ పార్టీ మిగిల్చిన నష్టం లెక్క చెప్పాలంటే రోహ్‌తస్ జిల్లాలోని దినారా నియోజకవర్గమే బెస్ట్ ఎగ్జాంపుల్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దినారా నియోజకవర్గం నుంచి మంత్రి జై కుమార్ సింగ్ పోటీ చేశారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన జై కుమార్ విజయం ఈసారి నల్లేరు మీద నడకే అనుకున్నారంతా ! ఎల్జేపీ ఎఫెక్ట్‌తో మూడో స్థానానికి పడిపోయిన పరిస్థితి ఇక్కడ ! ఎల్జేపీ ఓట్లు చీల్చడంతో ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థి విజయం సాధించారు. జైకుమార్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. దర్బంగా రూరల్, అలౌలి, అత్రి, బాజ్‌పట్టి, ఎక్మా, జైఘాట్, ఇస్లాంపూర్, కజారియా, లౌకా ఇలా చాలా నియోజకవర్గాల్లో ఎన్డీఏను కోలుకోలేని దెబ్బ తీసింది ఎల్జేపీ.

ఎల్జేపీ కూడా కలిసి ఉంటే ఇంకో రేంజ్‌లో ఉండేది ఆధిక్యం ! గెలిచింది ఒక్క సీటు మాత్రమే అయినా ఎల్జేపీ మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు అన్నది రాజకీయవిశ్లేషకులు అభిప్రాయం. ఐతే నితీష్ సీఎంగా ఉన్నంతవరకు ఆయనకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని చిరాగ్ పాశ్వాన్ అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories