Zombie Reddy: సీక్వెల్ కు రెడీ అవుతోన్న 'జాంబీ రెడ్డి' ?

Zombie Reddy: టాలీవుడ్ తొలి జాంబీ సినిమా 'జాంబీ రెడ్డి'కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

Venkata Chari
Updated on: 11 May 2021 10:01 PM IST
Zombie Reddy sequel on cards?
X

జాంబీరెడ్డి (ఫొటో ట్విట్టర్)

Zombie Reddy: టాలీవుడ్ తొలి జాంబీ సినిమా 'జాంబీ రెడ్డి'కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రమోషన్ల సందర్భంగా ఈ చిత్రం విడుదలకు ముందే దర్శకుడు ప్రశాంత్ వర్మ సీక్వెల్ కూడా చేయనున్నట్లు పేర్కొన్నాడు.

తాజా నివేదికల ప్రకారం, ప్రశాంత్ వర్మ ప్రమోషన్ల కోసం అలా చేయలేదు. నిజంగానే జాంబిరెడ్డి సీక్వెల్ కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మొదటి భాగంలో ప్రధాన పాత్ర పోషించిన తేజ సజ్జా సీక్వెల్ లో కూడా నటించే అవకాశం ఉందంట. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. 'జాంబీ రెడీ' ప్రీక్వెల్ లో కరోనావైరస్ మొదటి వేవ్ చుట్టూ ఎలా తిరిగిందో.. సీక్వెల్ లోనూ కోవిడ్ -19 సెకండ్ వేవ్ గురించి చూపించనున్నట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మ వీలైనంత త్వరగా బౌండెడ్ స్క్రిప్ట్‌ను డెవలప్ చేసి, సినిమాను త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడంట. ఈ సినిమా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story