Zombie Reddy Movie: టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోతున్న జాంబిరెడ్డి

Zombie Reddy Movie: రెండోసారి టీవీలో ప్రసారమైన జాంబిరెడ్డి మూవీ రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించింది.

Kranthi
Published on: 28 May 2021 8:33 AM IST
Zombie Reddy Movie Good Trp in  Second Telecast
X

Zombie Reddy Movie:(File Image)

Zombie Reddy Movie: హీరో చైల్డ్ ఆర్టిస్ట్.. హీరోయిన్ కొత్తవాళ్లే. అంతా కొత్తవాళ్లతో హిట్ కొట్టడమంటే మాటలు కాదు. డైరెక్టర్ తీసుకున్న సబ్జెక్టే విజయాన్ని అందించింది. అవును ప్రశాంత్ వర్మ జాంబిరెడ్డి కోసం జాంబి స్టైల్ కథ రాసుకోవడమే కలిసొచ్చింది. అందులో కామెడీని బాగా మిక్స్ చేయడంతో.. ఇక తిరుగు లేకుండా పోయింది. పిల్లలకు, మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది.

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా 'జాంబి రెడ్డి'. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన నటుడు తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ సినిమా ఈ మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కరోనాను బ్యాగ్ గ్రౌండ్‌లో తీసుకుని జాంబి రెడ్డి సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం కూడా జోడించిడంతో సినిమాలో నవ్వులు పువ్వులు పూసాయి. కామెడీ ఓ రేంజ్‌లో పేలింది.

ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌లో వచ్చినా అందులోనే కామెడీ కూడా వర్కవుట్ చేయడంతో జనాలు బాగానే ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. రూ. 4 కోట్ల బడ్జెట్‌తో రూపోందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15 కోట్ల వరకు వసూలు చేసిందని టాక్. చిన్న సినిమాగా వచ్చిన టాక్ బాగుండడంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి నందినీ, ఢిల్లీ బ్యూటీ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా నటించారు. గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్' తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.

అది అలా ఉంటే ఈ సినిమా 'జాంబి జోనర్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా. ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా కొనుగోలు చేసంది. కాగా ఈ సినిమా మొదటిసారి స్టార్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ప్రసారం చేస్తే ఏకంగా 9.7 టీఆర్పీ వచ్చింది. ఓ కొత్త హీరోకు ఈ రేంజ్ రేటింగ్ అంటే పెద్ద విశేషమే అంటున్నారు. ఆహాలో రిలీజయ్యాక కూడా మంచి వ్యూస్ వచ్చాయి.

Kranthi

Kranthi

Next Story