'జాంబిరెడ్డి' డిలీట్‌ సీన్..‌ చూస్తే నవ్వాపుకోలేరు

జాంబిరెడ్డి డిలీట్‌ సీన్..‌ చూస్తే నవ్వాపుకోలేరు
x
Highlights

Zombie Reddy: తెలుగులో తొలిసారి జాంబీ జోనర్ సినిమా చేయడమే ఓ సాహసం.

Zombie Reddy: తెలుగులో తొలిసారి జాంబీ జోనర్ సినిమా చేయడమే ఓ సాహసం. వైవిధ్యభరితమైన కథలను తనదైన మార్క్‌లో ప్రజెంట్ చేసే ప్రశాంత్ వర్మ..ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తొలి తెలుగు జాంబీ మూవీ ప్రేక్షకుల ముందకు వచ్చింది 'జాంబి రెడ్డి'. యంగ్ హీరో తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కార్ హీరో హీరోయిన్లుగా నటించగా.. పృథ్వీరాజ్, గెటప్ శీను, హేమంత్, హర్షవర్ధన్, అదుర్స్ రఘు, అన్నపూర్ణమ్మ కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమాను ఇప్పటికే చాలా మంది విక్షించారు. దీంతో ఆహా వారు ఈ చిత్రానికి ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నార. ఈక్రమంలో ఈ చిత్రంలో డిలీట్‌ అయిన ఓ సన్నివేశాన్ని 'ఆహా' పంచుకుంది. పెళ్లి కొడుకైన ఆర్జే హేమంత్‌కు నిజం చెప్పేందుకు తేజ ప్రయత్నించగా, ఆనంది అడ్డుకునే సీన్‌ సరదాగా ఉంది. ఆ ఆసక్తికర సన్నీవేశాన్ని మీరు కూడా వీక్షించండి.
Show Full Article
Print Article
Next Story
More Stories