Daksha Nagarkar: "జాంబిరెడ్డి" బ్యూటీతో మాస్ మహారాజా

Daksha Nagarkar: రవితేజ సినిమాలో కనిపించనున్న "జాంబి రెడ్డి" భామ

admin1
Updated on: 10 Jan 2022 7:31 PM IST
Zombie Reddy Heroine Daksha Nagarkar Will Be Seen in Ravi Teja Movie
X

 "జాంబిరెడ్డి" బ్యూటీతో మాస్ మహారాజా

Daksha Nagarkar: వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు "క్రాక్" సినిమాతో మంచి విజయాన్ని సాధించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో రవితేజ తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే 'రావణాసుర', 'ధమాకా', 'టైగర్ నాగేశ్వరరావు', 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలను లైన్లో పెట్టాడు రవితేజ. అయితే ఇవ్వన్నీ ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. కానీ "ఖిలాడి" సినిమా మాత్రం ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయడం విశేషం.

మరోవైపు "రావణాసుర" సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 14న పూజా కార్యక్రమాలతో ఈసినిమా అధికారికంగా లాంచ్ కాబోతోంది. ఈ సినిమాలో రవితేజ ఒక లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక లేడి విలన్ పాత్ర కూడా ఉండబోతుందట. దానికోసం "జాంబీ రెడ్డి" సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దక్ష నగర్కర్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తేజ హీరోగా నటించిన "జాంబి రెడీ" మంచి విజయం సాధించినప్పటికీ ఇంకా స్టార్ స్టేటస్ రాలేదు మరి ఈ సినిమా తన కెరీర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

admin1

admin1

Next Story