RRR Movie: రిలీజ్‌‌కు ముందే రికార్డులు; డిజిటల్, శాటిలైట్‌ రైట్స్‌లో హవా?

RRR Movie : ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా డైరెక్టర్‌ ఎస్ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న సినిమా 'రౌధ్రం రణం రుధిరం'.

Venkata Chari
Updated on: 22 May 2021 3:47 PM IST
ZEE5 Buys RRR Movie Digital and Satellite Rights
X

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (ఫొటో ట్విట్టర్)

RRR Movie: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా డైరెక్టర్‌ ఎస్ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న సినిమా 'రౌధ్రం రణం రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్). అధిక బడ్జెట్‌తో పాన్‌ ఇండియాగా రానున్నఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ పై అంచనాలు హై రేంజ‌్‌లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన స్పెషల్‌ వీడియోలు, పోస్టర్లు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే యూట్యూబ్‌, ట్విట్టర్లో ఎన్నో సంచనాలు క్రియోట్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. అన్ని భాషలకు సంబంధించి ఈ సినిమా డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ను జీ గ్రూప్‌ భారీ మొత్తానికి తీసుకుందని సమాచారం. డిజిటల్, శాటిలైట్‌ రైట్స్‌ కోసం రూ.325 కోట్లను జీ5 ఆర్ఆర్ఆర్‌ టీంకు చెల్లించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా, ఇప్పటి వరకైతే అధికారికంగా ఎలాంటి సమచారం లేదు. ఈ వార్త నిజమైతే.. ఇండియన్ మూవీ హిస్టరీలో ఓ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఈ రేంజ్‌లో అమ్ముడుకావడం ఇదే తొలిసారి అవుతుంది. అలాగే అన్ని హక్కులు కలిపి ఈ సినిమా బిజినెస్‌ రూ. 900 కోట్లకు చేరిందని టాక్ వినిపిస్తోంది.

కాగా, యాక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీంగా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాతో ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తియినట్లు తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story