Ram Charan: చిత్ర రైట్స్ తోనే రికార్డులు సృష్టిస్తున్న రామ్ చరణ్

Zee Studios Grab the RC15 Movie Digital and Satellite Right With Huge Amount
x

 చిత్ర రైట్స్ తోనే రికార్డులు సృష్టిస్తున్న రామ్ చరణ్ (ట్విట్టర్ ఇమేజ్)

Highlights

Ram Charan: అప్పుడే రికార్డులు మొదలుపెట్టిన రామ్ చరణ్ శంకర్ సినిమా

Ram Charan: ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాని అభిమానులు #ఆర్సీ15 అని పిలుస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ఒక రాజకీయనాయకుడు పాత్రలో కనిపిస్తారని సమాచారం. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన థియేట్రికల్, సాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ను జీ స్టూడియోస్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేశారట.

కేవలం రైట్స్ కోసం జీ వారు నిర్మాతలకు 350 కోట్లు ఇచ్చారట. ఈ డీల్ తో మాత్రమే నిర్మాతలు ఇప్పటికే సినిమా బడ్జెట్ మొత్తాన్ని వెనక్కి సంపాదించడం విశేషం. శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కియర అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. "వినయ విధేయ రామ" సినిమా తర్వాత రామ్ చరణ్ సరసన కియార నటిస్తున్న రెండవ సినిమా ఇది. దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories